సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ఇలియానాకు బాలీవుడ్ లో భారీ ఆఫర్
- కమల్ సినిమాలో వెన్నెల కిశోర్
- మళ్లీ వస్తున్న కథానాయిక సంగీత
* కమలహాసన్, శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'భారతీయుడు 2'లో తెలుగు హాస్యనటుడు వెన్నెల కిశోర్ ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
* గతంలో పలు చిత్రాలలో కథానాయికగా నటించిన సంగీత ఎనిమిదేళ్ల విరామం అనంతరం మళ్లీ టాలీవుడ్ కి వచ్చింది. శ్రీకాంత్ హీరోగా రూపొందుతున్న 'తెలంగాణ దేవుడు' చిత్రంలో సంగీత కథానాయికగా నటించింది.