తన పాత్రను మహేష్ బాబు చేస్తే బాగుంటుందట... వీవీఎస్ లక్ష్మణ్ మనసులో మాట!
- పుస్తకరూపంలో వీవీఎస్ స్వీయ చరిత్ర
- సినిమాగా తీస్తే మహేష్ బాబు బాగుంటారు
- వెల్లడించిన స్టైలిష్ బ్యాట్స్ మెన్ లక్ష్మణ్
ఇప్పుడు తన జీవిత కథను పుస్తక రూపంలో తెస్తున్నానని, దీనిలో అన్ని విషయాలూ ఉన్నాయని తెలిపారు. సినిమా పూర్తి వాస్తవికంగా ఉంటేనే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. పెళ్లికి ముందు అమ్మ, నాన్న, మామయ్యలు, పెళ్లి తరువాత భార్య శైలజ తన జీవితంలో ప్రత్యేక వ్యక్తులని చెప్పారు. తన పిల్లలు భవిష్యత్తులో ఏ రంగాన్ని ఎంచుకుంటారన్న విషయంలో పూర్తి స్వేచ్ఛను ఇస్తానని, ప్రస్తుతం అబ్బాయి సర్వజిత్ ఏడో తరగతి, పాప అచింత్య 5వ తరగతి చదువుతున్నారని అన్నారు.