నేను విశాఖలో అడుగుపెట్టినపుడే సీసీ కెమెరాలు ఆగిపోయాయి: దాడి ఘటనపై జగన్
- గంటకే స్క్రీన్‌ప్లే మార్చేశారు
- ప్రశ్నించినందుకే హత్యాయత్నం
- నిందితుడి వద్ద లెటర్ కనిపించలేదు
దాడి సమయంలో నిందితుడి వద్ద ఎలాంటి లెటర్ కనిపించలేదన్నారు. తాను విశాఖలో అడుగుపెట్టినపుడే సీసీ కెమెరాలు ఆగిపోయాయని.. అసలు మెరుగైన పాలన కోరుకునే అభిమాని తనపై దాడి ఎందుకు చేస్తాడని విమర్శించారు. తెలిసీ తెలియకుండా అభాండాలు వెయ్యొద్దనే ఒక్క కారణంగా తాను ఇప్పటి వరకూ ఈ ఘటనపై స్పందించలేదన్నారు. తనపై హత్యాయత్నం కుట్ర చేయకుంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు ఎందుకు ఒప్పుకోరని ప్రశ్నించారు. ఒకవేళ సీబీఐ విచారణ జరిగితే చంద్రబాబు జైలుకి వెళ్లాల్సి వస్తుందని వణికిపోతున్నారని జగన్ ఎద్దేవా చేశారు.