రవిబాబును బాగా దెబ్బతీసిన పందిపిల్ల!
- ప్రయోగాత్మక చిత్రాలు చేసే రవిబాబు
- తాజాగా 'అదిగో' పేరిట పందిపిల్లతో సినిమా
- భారీ నష్టాలే మిగిలాయంటున్న టాలీవుడ్
పందిపిల్లతో సినిమా అని తన సాహస నిర్ణయాన్ని ప్రకటించి, సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచిన ఆయన, సినిమాలోని కంటెంట్ విషయమై శ్రద్ధ పెట్టలేదని, ప్రమోషన్ కూడా అంతంతమాత్రంగానే సాగడంతో ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయిందని సినీ విమర్శకులు అంటున్నారు. దీంతో సినిమా షూటింగ్ కన్నా, గ్రాఫిక్స్ కు అధికంగా ఖర్చు పెట్టిన రవిబాబు, ఎన్నో కోట్లు నష్టపోయాడని తెలుస్తోంది.