సీబీఐని నిరాకరించే అధికారం రాష్ట్రాలకు ఉంది.. కోర్టులు కూడా ఏమీ చేయలేవు: లాయర్ ఎర్నేని వేదవ్యాస్
- ఢిల్లీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం సీబీఐని రాష్ట్రాలు నిరాకరించవచ్చు
- ఒక భారత పౌరుడిగా నా వినతిపత్రాన్ని సీఎస్ కు ఇచ్చా
- సీబీఐ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతింది
సీబీఐని నిరాకరించే అధికారం రాష్ట్రాలకు ఉందని ఎర్నేని వేదవ్యాస్ అన్నారు. ఈ విషయంలో కోర్టులు కూడా ఏమీ చేయలేవని చెప్పారు. సీబీఐ ప్రతిష్ట దెబ్బతిందని... సీబీఐ కార్యాలయాల్లో సీబీఐ అధికారులే దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సీబీఐ, ఐటీ, ఈడీలను రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఢిల్లీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం సీబీఐని నిరాకరించే అధికారం రాష్ట్రాలకు ఉందని తెలిపారు. బాధ్యత కలిగిన ఒక భారత పౌరుడిగా, విజయవాడ న్యాయవాదిగా తన వినతిపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చానని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా... న్యాయపరంగా ఎదుర్కోవడానికి తాను సిద్ధమేనని తెలిపారు.