హిందీ 'అర్జున్ రెడ్డి' గురించి విజయ్ దేవరకొండ
- 'అర్జున్ రెడ్డి' ఫ్యాక్షన్ మూవీ అనుకున్నారు
- 'కబీర్ సింగ్' టైటిల్ బాగుంది
- హిందీలో హిట్ కొట్టి తీరుతుంది
ఈ సినిమాను గురించి తాజాగా విజయ్ దేవరకొండ స్పందిస్తూ .. "తెలుగులో 'అర్జున్ రెడ్డి' టైటిల్ చూసి అంతా కూడా ఇదేదో ఫ్యాక్షన్ మూవీ అనుకున్నారు. అలా కాకుండా హిందీ టైటిల్ 'కబీర్ సింగ్' చాలా బాగుంది. తప్పకుండా అక్కడ కూడా సందీప్ వంగా తన సత్తా చాటుతాడనే నమ్మకం వుంది. ఈ సినిమా టీజర్ కోసం నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. హిందీలోనూ ఈ సినిమా భారీ హిట్ కొడుతుందని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు. 'అర్జున్ రెడ్డి' తమిళంలోను 'వర్మ' పేరుతో రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే.