కాంతారావు జీవితంలో ఎవరికీ తెలియని ఘట్టాలు వున్నాయి: దర్శకుడు పీసీ ఆదిత్య
- కాంతారావు జయంతి నేడు
- ఆయన బయోపిక్ లో ఎవరికీ తెలియని నిజాలు
- డిసెంబర్ 10 నుంచి రెగ్యులర్ షూటింగ్
కాంతారావు సొంత ఊరైన కోదాడ సమీపంలోని 'గుడిబండ' కి వెళ్లి మరీ పీసీ ఆదిత్య కొన్ని వివరాలను సేకరించారు. కాంతారావు భార్యను.. వారి అబ్బాయిలను అడిగి మరికొన్ని వివరాలను సేకరించారు. కాంతారావు జీవితంలో ఎవరికీ తెలియని కొన్ని ఘట్టాలు ఉన్నాయనీ, వాటిని ఈ సినిమాలో ఆవిష్కరించడం జరుగుతుందని ఆదిత్య అన్నారు. డిసెంబర్ 10 తరువాత రెగ్యులర్ షూటింగును జరపనున్నామని చెప్పారు.