అమ్మకు అనారోగ్యం .. సినిమాలు మానేద్దామనుకున్నా: విజయ్ దేవరకొండ
- అమ్మ హాస్పిటల్లో వుంది
- ఆమె దగ్గర లేనందుకు బాధ
- ఫోన్ చేసి ఆ మాట చెప్పేశాను
ఇదే సమయంలో మా అమ్మ అనారోగ్యానికి గురికావడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లారు. షూటింగు స్పాట్ లో వున్న నాకు ఏం జరుగుతున్నది తెలియడం లేదు. అమ్మ దగ్గర ఉండలేకపోవడం ఎంతో బాధనిపించింది. దాంతో ఇకపై ఇలాంటి పరిస్థితి రాకూడదని భావించి, సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. అడ్వాన్సులు ఇచ్చిన దర్శక నిర్మాతలకి ఫోన్ చేసి ఆ విషయం చెప్పేశాను కూడా. అలాంటి ఒత్తిడిలో మేము చేసిన సినిమా లీక్ అయిందంటే ఎలా వుంటుందో ఒకసారి ఆలోచించండి" అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.