సాయిపల్లవికి కితాబునిచ్చిన శర్వానంద్!
- శర్వానంద్ జోడీగా సాయిపల్లవి
- సాయిపల్లవి మంచి నటి అన్న శర్వానంద్
- డిసెంబర్ 21వ తేదీన రిలీజ్
ఈ సినిమా షూటింగు సమయంలో సాయిపల్లవి ధోరణి గురించిన వార్తలు బయటికి వస్తాయని ఎదురుచూసినవారికి నిరాశే ఎదురైంది. ఈ సినిమా షూటింగ్ చాలా బాగా జరిగిందని తాజాగా శర్వానంద్ చెప్పాడు. "సాయిపల్లవి మంచినటి .. స్క్రిప్ట్ ను అర్థం చేసుకుని నటించే హీరోయిన్స్ లో ఆమెకి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె చాలా తెలివైన హీరోయిన్" అని అన్నాడు. మొత్తానికి సాయిపల్లవికి సంబంధించి ఎలాంటి రూమర్స్ షికారు చేయకపోగా, ఆమెకి మంచి మార్కులు దక్కడం విశేషం.