డిజిటల్ ప్రపంచంలోనూ రాణించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్!
- బుల్లితెరపై తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్
- వెబ్ సిరీస్ రంగంలోనూ రాణించేందుకు సిద్ధం
- మంచి కథ కోసం అన్వేషణ ప్రారంభం
హిందీలోనూ మాధవన్, సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి అగ్ర కథానాయకులు సినిమాలతోపాటే వెబ్ సిరీస్ రంగంలో రాణిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ ఆర్’ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ గ్యాప్‌లో వెబ్ సిరీస్ చేసేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. ఇప్పటికే మంచి కథ కోసం అన్వేషణ కూడా మొదలైందని తెలుస్తోంది.