కొత్త కథతో రంగంలోకి దిగిన శేఖర్ కమ్ముల
- శేఖర్ కమ్ముల నుంచి మరో ప్రేమకథా చిత్రం
- పరిచయం కానున్న కొత్త నటీనటులు
- డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు
శేఖర్ కమ్ములతోపాటు నిర్మాతలు .. సహ నిర్మాతలు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్త నటీనటులతో శేఖర్ కమ్ముల ఈ సినిమాను రూపొందించనున్నాడు. ఆల్రెడీ వాళ్ల ఎంపిక ప్రక్రియను కూడా పూర్తిచేసేశాడు. డిసెంబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నట్టు చెబుతున్నారు. ఈ రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీ యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతుందనే నమ్మకాన్ని దర్శక నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు.