దూసుకుపోతోన్న 'అమర్ అక్బర్ ఆంటోని' ట్రైలర్
- నిన్న విడుదలైన ట్రైలర్
- ఇంతవరకూ 4 మిలియన్ల వ్యూస్
- యాక్షన్ కామెడీగా సాగే కథ
"ఈ ప్రపంచంలో శక్తి చాలక నమ్మకం నిలబెట్టుకోనివాళ్లు కొందరైతే, శక్తిమేరకు నయవంచన చేసేవాళ్లు కోకొల్లలు" అంటూ వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఇంతవరకూ ఈ ట్రైలర్ కి 4 మిలియన్ల వ్యూస్ లభించినట్టు స్పెషల్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. యాక్షన్ ను .. కామెడీని కలిపి శ్రీను వైట్ల నడిపించిన తీరు, తమన్ సంగీతం .. రవితేజ డిఫరెంట్ లుక్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.