నేడూ తగ్గిన పెట్రోలు ధరలు.. ఈసారి బహు స్వల్పం
- వరుసగా తగ్గుతూ వస్తున్న పెట్రో ధరలు
- నేడు పెట్రోలుపై 17, డీజిల్‌పై 15 పైసలు తగ్గుదల
- ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ. 77.56
ఇటీవల దేశంలో ఎన్నడూ లేనంతగా పెట్రోలు ధరలు పెరుగుతూ పోవడంతో వాహనదారుల జేబులు చిల్లులు పడ్డాయి. పెట్రో ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. వాహనదారుల అవస్థలపై స్పందించిన కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ పన్నుల్లో కొంత వాటాను తగ్గించడంతో కొంత ఊరట లభించింది. రాష్ట్రాలు తమ పన్నులను తగ్గిస్తుండడంతో కేంద్రం కూడా దిగివచ్చింది. అక్టోబరు 4న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పెట్రోలు, డీజిల్‌పై రూ. 2.50 తగ్గించారు.