విహారయాత్రలో విషాదం.. ఆరుగురి గల్లంతు
- స్నానానికి దిగిన 12 మంది యువకులు
- కొట్టుకుపోతుండగా ఆరుగురిని రక్షించిన జాలర్లు
- మరో ఆరుగురి గల్లంతు
అలల ఉద్ధృతికి అందరూ కొట్టుకుపోతుండగా గమనించిన జాలర్లు కొందరిని ఒడ్డుకు తీసుకొచ్చి.. అధికారులకు సమాచారమిచ్చారు. గల్లంతైన వారిలో వాసు, తిరుపతి, గణేశ్, దుర్గ, రాజేశ్, శ్రీను ఉన్నారు. గల్లంతైనవారిని ఇసుకతోట దగ్గర దుర్గానగర్ ఎస్సీ కాలనీకి చెందిన యువకులుగా గుర్తించారు. వీరికోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే చీకటి పడుతుండటంతో గాలింపు చర్యలకు విఘాతం కలుగుతోందని అధికారులు భావిస్తున్నారు.