చిన్న వాడివైనా అవకాశం ఇచ్చా... పార్టీకి మంచి పేరు తీసుకురా: కిడారి శ్రవణ్ కు చంద్రబాబు సూచన
- ఏపీ కేబినెట్ల లో ఫరూక్, కిడారి శ్రవణ్ లకు స్థానం
- సమచర మంత్రులు, జిల్లా నేతలతో సమన్వయంతో పని చేయాలంటూ చంద్రబాబు సూచన
- శాసనసభలో ప్రభుత్వ విప్ గా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా పేరు ఖరారు
ఫరూక్, శ్రవణ్ లు మంత్రులుగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో శాసనమండలి ఛైర్మన్ పదవికి ఫరూక్ రేపు రాజీనామా చేయనున్నారు. మరోవైపు, శాసనసభలో ప్రభుత్వ విప్ గా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా పేరును చంద్రబాబు ఖరారు చేశారు.
ఈ సందర్భంగా మైనార్టీ నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంత్రివర్గంలో ముస్లింలకు చోటు కల్పించే విషయంలో జరిగిన జాప్యానికి గల కారణాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి వివరించారు. మంత్రి పదవులు దక్కని ముస్లిం ఎమ్మెల్యేలకు భవిష్యత్తులో అవకాశం కల్పిస్తానని చెప్పారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటానికి మద్దతుగా ముస్లింలను సమీకరించుకుని వెళ్లాలని ఈ సందర్భంగా నేతలకు మార్గనిర్దేశం చేశారు.