రవితేజ కొత్త చిత్రం టైటిల్ లోగో రిలీజ్ వాయిదా
- రిలీజ్ కి సిద్ధంగా రవితేజ - శ్రీను వైట్ల మూవీ
- రవితేజ నెక్స్ట్ మూవీ దర్శకుడిగా వీఐ ఆనంద్
- డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు
అయితే 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా ప్రమోషన్స్ లో రవితేజ బిజీగా వున్నాడు. అందువలన వీఐ ఆనంద్ ప్రాజెక్టుకు సంబంధించిన టైటిల్ లోగో రిలీజ్ ను వాయిదా వేసుకున్నారు. 'అమర్ అక్బర్ ఆంటోని' రిలీజ్ అయిన తరువాతనే తమ సినిమా టైటిల్ లోగోను ఆవిష్కరించాలనే నిర్ణయానికి వచ్చారట. నాభా నటేశ్ .. పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా ఈ సినిమా డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.