నామినేషన్ డిపాజిట్ మొత్తాన్ని చూసి అవాక్కయిన రిటర్నింగ్ అధికారి!
- విరాళాల రూపంలో రూ.10 వేల సేకరణ
- నాణేలను రిటర్నింగ్ అధికారి ముందు పోసిన దీపక్
- సిబ్బందితో లెక్క పెట్టించిన రిటర్నింగ్ అధికారి
స్వర్ణిమ్ భారత్ ఇంక్విలాబ్ పార్టీ నేత అయిన దీపక్ పవార్ ఇండోర్-3 శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే నామినేషన్ నిమిత్తం పూచీకత్తు కోసం రూ.10 వేలను ప్రజల నుంచి విరాళాల రూపంలో దీపక్ సేకరించారు. వాటిని నోట్లుగా మార్చే వెసులుబాటు లేకపోవడంతో ఆ సొమ్మును అలాగే తీసుకెళ్లి రిటర్నింగ్ అధికారి ఎదుట పోశారు. దీంతో చేసేదేమీలేక రిటర్నింగ్ అధికారి తన సిబ్బందితో లెక్కపెట్టించారు. అయితే సిబ్బందికి ఆ సొమ్మును లెక్కపెట్టేందుకు గంటన్నర పట్టింది.