రవితేజ మూవీ టైటిల్ ఏమిటనేది ఆ రోజున చెబుతారట!
- వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ
- సైంటిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
- ఈ నెల 13వ తేదీన టైటిల్ లోగో రిలీజ్
సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందనుంది. ఈ తరహా జానర్లో సినిమా చేయడం రవితేజకి ఇదే మొదటిసారి. అనూహ్యమైన మలుపులతో ఉత్కంఠను రేకెత్తిస్తూ ఈ కథ కొనసాగుతుందని ఈ చిత్ర నిర్మాత రామ్ తాళ్లూరి చెప్పారు. ఈ సినిమా కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ టైటిల్స్ అనుకున్నామనీ, ఒక టైటిల్ ను ఓకే చేసి నవంబర్ 13వ తేదీన లోగోను రిలీజ్ చేయనున్నామని చెప్పారు. త్వరలోనే మిగతా వివరాలను వెల్లడిస్తామని అన్నారు.