టీడీపీలో చేరేందుకు సిద్ధమైన కేసీఆర్ అన్న కుమార్తె!
- చంద్రబాబును కలిసిన రమ్య
- టీడీపీలో చేరే అంశంపై చర్చ
- కాంగ్రెస్ నేతల వైఖరితో మనస్తాపం
గతంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రమ్య ఆ పార్టీ నేతల వైఖరితో మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. దీంతోనే ఆమె సైకిల్ జర్నీకి సిద్ధమైనట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని టీటీడీపీ నేతలతో చర్చించిన చంద్రబాబు ఈ సమయంలో రమ్యను పార్టీలోకి తీసుకుంటే రెచ్చగొట్టినట్టవుతుందేమోననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలతో టీటీడీపీ నేతలు కూడా ఏకీభవించినట్టు తెలుస్తోంది.