ఫస్టు టైమ్ తెలుగులో డబ్బింగ్ చెప్పిన ఇలియానా
- శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ
- బొద్దుగుమ్మగా కనిపించనున్న ఇలియానా
- ఈ నెల 16వ తేదీన విడుదల
తాజాగా 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాలో ఇలియానా తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫస్టు టైమ్ తన పాత్రకి తానే చెప్పుకున్న డబ్బింగ్ ఆడియన్స్ నుంచి ఎన్ని మార్కులు తెచ్చిపెడుతుందో చూడాలి. అంతేకాదు గత చిత్రాల్లో నాజూకు భామగా ఒయ్యారాలు ఒలకబోసిన ఇలియానా, ఈ సినిమాలో బొద్దుగుమ్మగా కనిపించనుంది. శ్రీను వైట్ల ఎదురుచూస్తోన్న సక్సెస్, ఈ సినిమాతో దొరుకుతుందేమో చూడాలి.