బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న ‘సర్కార్’
- నెగిటివ్ టాక్‌ను పట్టించుకోని అభిమానులు
- తెలుగు రాష్ట్రాల్లోనూ దూసుకుపోతున్న ‘సర్కార్’
- ఓవర్సీస్‌లో కలెక్షన్ల వర్షం
ఇక, ఓవర్సీస్‌లో అయితే చెప్పనక్కర్లేదు. కలెక్షన్ల సునామీతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే మొదటి రోజు రూ. 2.32 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. సినిమా పట్ల కొంత నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ వసూళ్లపై ఆ ప్రభావం కనిపించకపోవడం విశేషం.
ఈ సినిమాకు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించగా కీర్తి సురేశ్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. కాగా, విజయ్ గత సినిమా మెర్సల్ (అదిరింది) కూడా తెలుగులో హిట్టయిన సంగతి తెలిసిందే.