రానా, గుణశేఖర్ ల 'హిరణ్యకశిప' వుందట!
- గుణశేఖర్ దర్శకుడిగా 'హిరణ్యకశిప'
- నిర్మాతగా రానా
- భారతీయ భాషలన్నిటిలో రిలీజ్
తాజాగా ఈ ప్రాజెక్టు గురించే నిర్మాత సురేశ్ బాబు మాట్లాడారు. "ఈ సినిమాకి సంబంధించిన పనుల్లోనే వున్నాము. దర్శకుడు గుణశేఖర్ వైపు నుంచి కూడా పనులు చురుగ్గా జరుగుతున్నాయి. గ్రాఫిక్స్ పనులు 'లండన్' లో జరగనున్నాయి. ఈ సినిమాకి రానాయే నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాను అన్ని భారతీయ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచన వుంది. భారీ ప్రాజెక్టు కనుక ఆలస్యం అవుతోంది" అని ఆయన చెప్పుకొచ్చారు.