అదరగొట్టేస్తోన్న 'అమర్ అక్బర్ ఆంటోని' లిరికల్ వీడియో సాంగ్
- ఈ నెల 10న ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఈ నెల 16వ తేదీన సినిమా రిలీజ్
- అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి
తమన్ అందించిన ఈ బాణీ యూత్ ని హుషారెత్తించేలా వుంది. 'విశ్వ' రాసిన ఈ పాటను .. శ్రీకృష్ణ .. జస్ప్రీత్ .. రమ్య బెహ్రా తదితరులు ఆలపించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 10వ తేదీన గ్రాండ్ గా జరపనున్నారు. ఈ నెల 16వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. శ్రీను వైట్ల .. రవితేజ కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమాలు భారీ విజయాలను సాధించాయి. అందువలన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది.