రవితేజ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు
- రవితేజ హీరోగా 'అమర్ అక్బర్ ఆంటోని'
- ఈ నెల 10వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
- 16వ తేదీన సినిమా విడుదల
ఈ నెల 10వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకి పెద్దసంఖ్యలో హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 16వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తమన్ స్వరపరిచిన పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. ఈ సినిమా సక్సెస్ పైనే ఇటు శ్రీను వైట్ల .. అటు రవితేజ ఆశలు పెట్టుకున్నారు. ఇక మళ్లీ తెలుగులో పాగా వేద్దామనుకుంటోన్న ఇలియానాకి కూడా ఈ సినిమా హిట్ ముఖ్యమే.