హీరోగా మారిపోయిన మరో కమెడియన్!
- కమెడియన్ గా యోగిబాబుకి క్రేజ్
- యమధర్మరాజుగా ప్రధాన పాత్ర
- ఈ ఏడాది చివర్లో విడుదల
'ధర్మప్రభో' అనే ఒక హాస్యభరితమైన సినిమాలో ఆయన యమధర్మరాజుగా కనిపించనున్నాడు. ముత్తు కుమారన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నారు. రీసెంట్ గా వదిలిన ఈ సినిమా ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా తరువాత యోగిబాబు హీరోగా మరికొన్ని సినిమాలు రూపొందే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.