అందాల అంజలి మరీ చిక్కిపోయిందే!
- తెలుగు .. తమిళ భాషల్లో క్రేజ్
- ఇటీవల తగ్గిన అవకాశాలు
- బొద్దుగా ఉంటేనే బాగుందనే కామెంట్స్
తన ఫేస్ బుక్ లోను .. ట్విట్టర్ లోను ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు చూసినవాళ్లు ఆశ్చర్యపోతున్నారు .. అంతగా అంజలి సన్నబడిపోయింది. నిజం చెప్పాలంటే ఒక్కసారిగా ఈ ఫోటో చూసిన వాళ్లు అంజలి అంటే నమ్మరు. మరి ఏదైనా సినిమాలో పాత్ర కోసం ఆమె సన్నబడిందా? బొద్దుగా ఉండటం వల్లనే అవకాశాలు రావడం లేదనే ఉద్దేశంతో బరువు తగ్గిందా? అనేది తెలియడం లేదు. ఈ ఫోటోలు చూసిన వాళ్లు మాత్రం అంజలి మరీ సన్నబడిపోయిందనీ, ఆమె బొద్దుగా ఉంటేనే బాగుందనే కామెంట్స్ చేస్తున్నారు.