తెరపైకి సునందా పుష్కర్ బయోపిక్!
- బాలీవుడ్లో బయోపిక్ ల జోరు
- సునందా పుష్కర్ గా దీపికా పదుకొనే
- శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం
ఈ నేపథ్యంలోనే ఈ తరహా సినిమాల జాబితాలోకి 'సునందా పుష్కర్' బయోపిక్ కూడా చేరిపోయింది. యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా వున్న శశి థరూర్ తో ఆమె వివాహం జరిగింది. ఎన్నో వ్యాపార వ్యవహారాలను తన ప్రతిభా పాటవాలతో ఆమె చక్కబెట్టింది. అలాంటి ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె మరణం ఒక మిస్టరీగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె జీవిత విశేషాలను తెరకెక్కించడానికి దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ రంగంలోకి దిగాడు. సునంద పాత్రకి గాను ఆయన దీపికా పదుకొనేను ఎంపిక చేసుకున్నాడు . త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.