వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ .. త్వరలో ఫస్టులుక్
- శ్రీను వైట్లతో రవితేజ మూవీ
- తదుపరి సినిమా వీఐ ఆనంద్ తో
- డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్
డిసెంబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్టు లుక్ కాన్సెప్ట్ పోస్టర్ ను దీపావళికి రిలీజ్ చేయనున్నారు. ఆ దిశగానే చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారు. అందులో ఒక కథానాయికగా నాభా నటేశ్ ను తీసుకున్నారు. రవి తాళ్లూరి నిర్మిస్తోన్న ఈ సినిమా, తన కెరియర్లో తప్పకుండా ఒక డిఫరెంట్ మూవీ అవుతుందని రవితేజ భావిస్తున్నాడు.