కొత్త కథకి ఓకే చెప్పేసిన గోపీచంద్
- గోపీచంద్ కి కథ వినిపించిన సంపత్ నంది
- డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు
- త్వరలోనే పూర్తి వివరాలతో ప్రకటన
గతంలో సంపత్ నంది - గోపీచంద్ కాంబినేషన్లో 'గౌతమ్ నంద' సినిమా వచ్చిందిగానీ, పెద్దగా ఆడలేదు. అయినా కొత్తగా వినిపించిన కథ నచ్చడంతో గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసిన సంపత్ నంది, డిసెంబర్లో రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నట్టు తెలుస్తోంది. ఈ లోగా మిగతా నటీనటులను .. సాంకేతిక నిపుణులను ఖరారు చేసుకుని ఎనౌన్స్ చేస్తారట. ఈ సినిమాతో తప్పకుండా గోపీచంద్ కి హిట్ ఇవ్వాలనే సంపత్ నంది కోరిక నెరవేరుతుందేమో చూడాలి.