సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించాం: సురేశ్ ప్రభు
- జగన్ పై దాడిని ఖండిస్తున్నాం
- ఇప్పటికే సీఐఎస్ఎఫ్ విచారణ ప్రారంభమైంది
- జగన్ కు ఇంచున్నర లోతు వరకు గాయమైనట్టు తెలిపిన వైద్యులు
ఈ మధ్యాహ్నం హైదరాబాదుకు వస్తున్న సమయంలో ఎయిర్ పోర్ట్ లాంజ్ లో జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు పందెం కోడి కాళ్లకు కట్టే కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆయన ఎడమ చేతిపై గాయం అయింది. హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. ఒకటిన్నర ఇంచు లోతు వరకు గాయమైనట్టు వైద్యులు తెలిపారు.