ఆరావళి ప్రాంతంలోని 31 కొండలు మాయం... షాకైన సుప్రీంకోర్టు
- అక్రమ మైనింగ్ కారణంగా మాయమైన కొండలు
- 48 గంటల్లో అక్రమ మైనింగ్‌ను నిలిపివేయాలి
- కొండలు మాయమవడంపై సుప్రీంకోర్టు సీరియస్
గనుల తవ్వకాల వల్ల రాజస్థాన్‌కి రూ.5000 కోట్ల రాయల్టీ వస్తున్న మాట వాస్తవమేనని.. కానీ దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకోవడానికి ఆ కొండలు మాయమవడమే కారణమని తెలిపింది. కొండలు ఇలాగే మాయమైతే దేశ పరిస్థితి ఏంటని రాజస్థాన్ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదిని జస్టిస్ లోకుర్ ప్రశ్నించారు. ఆరావళి పరిధిలో అక్రమ మైనింగ్‌ను నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఫైర్ అయ్యారు. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 29కి వాయిదా వేశారు.