హౌస్ ఫుల్-4లో రానా దగ్గుబాటి.. నానా పటేకర్ కు బదులుగా నటించే ఛాన్స్!
- బాలీవుడ్ ను తాకిన ‘మీ టూ’ సెగ
- ప్రాజెక్టు నుంచి తప్పుకున్న నానాపటేకర్
- త్వరలోనే షూటింగ్ ప్రారంభం
ఈ నేపథ్యంలో హౌస్ ఫుల్-4 ప్రాజెక్టు ఇటీవల ఆగిపోయింది. అయితే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దర్శకుడిగా సాజిద్ ఖాన్ స్థానంలో ఫర్హాద్ సంజనీని తీసుకునేందుకు నిర్మాతలు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక నానాపటేకర్ స్థానంలో రానా దగ్గుబాటిని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే రానా ప్రతినిధితో చిత్ర యూనిట్ చర్చలు జరుపుతున్నట్లు బాలీవుడ్ వర్గాల టాక్.