నా మాటలకు రాజకీయ రంగు పులమొద్దు: మంచు మనోజ్ విన్నపం
- తిరుపతికి వచ్చిన మంచు మనోజ్
- ఘన స్వాగతం పలికిన అభిమానులు
- మరింత బలాన్ని ఇవ్వాలని భగవంతుడిని కోరానన్న మనోజ్
అభిమానులు స్వాగతం పలుకుతున్న చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఆయన, తనపై అపారమైన ప్రేమను చూపించి ఆశీర్వదించిన తిరుపతి ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నాడు. తన శ్రేయోభిలాషులకు, మిత్రులకు, ప్రజలకు చిన్న విన్నపం చేస్తున్నానని, ప్రజలందరికీ ఉపయోగపడేలా ఏదైనా చేయాలని ధృడ నిశ్చయంతో ఉన్నానని, ఈ పనికి రాజకీయ రంగులు పూయకండని అన్నాడు. అన్నీ కుదురుకుంటే, భవిష్యత్‌లో మరింత బలాన్ని, సహాయాన్ని అందించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానన్నాడు.