కేరళ ప్రభుత్వం మహా ప్లాన్.. పురుషుల వేషధారణలో ఆలయంలోకి మహిళలు?
- రాత్రివేళ ఆపరేషన్ చేపట్టేందుకు సిద్ధమైందన్న వార్తలు
- అందుకే మీడియాను పంపించేశారన్న భక్తులు
- ప్రభుత్వం తీరుపై అనుమానాలు
శబరిమలలో ఉన్న భక్తులను, మీడియా ప్రతినిధులను ఖాళీ చేయాల్సిందిగా సోమవారం ఆదేశించిన ప్రభుత్వం రాత్రివేళ ఈ ఆపరేషన్ చేపట్టాలని యోచిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జామర్లను ఏర్పాటు చేస్తోందని అనుమానిస్తున్నారు.
ఈనెల 18న అయ్యప్ప ఆలయాన్ని తెరిచి సోమవారం మూసివేశారు. చివరి రోజున స్వామిని దర్శించుకునేందుకు బయలుదేరిన దళిత కార్యకర్త బిందును పంబ వరకు రాకుండానే బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాగా, శబరిమల తీర్పుపై రివ్యూ పిటిషన్లను ఎప్పుడు విచారించేదీ సుప్రీంకోర్టు నేడు నిర్ణయించనుంది.