చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సినీ నటి రేవతి చౌదరి
- 1998లో మిస్ విజయవాడగా ఎంపికైన రేవతి
- 'కాకతీయుడు' సినిమాలో చాన్స్
- త్వరలో విడుదల కానున్న ఆమె నటించిన చిత్రం
రేవతి వివరాల్లోకి వెళ్తే, శివాజీ హీరోగా నటించిన చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల కాలేదు. తారకరత్న నటించిన 'కాకతీయుడు' సినిమాలో కూడా ఆమె నటించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. విజయవాడకు చెందిన రేవతి నాగార్జున యూనివర్శిటీలో చదివారు. 1998లో మిస్ విజయవాడగా ఎంపికయ్యారు. సినిమారంగంపై ఇష్టంతో హైదరాబాదుకు మకాం మార్చారు.