మా నాన్న పబ్ లకే పోడు.. ఇక ఆమెను రిసార్ట్, డిన్నర్ కు రమ్మంటాడా?: నటి శ్రుతిపై హీరో అర్జున్ కుమార్తె ఫైర్
- శ్రుతి తప్పుడు ఆరోపణలు చేస్తోంది
- ఆమెకు సొంత లాభాలు ఉన్నాయి
- స్క్రిప్ట్ లో అభ్యంతరకరమైన సీన్లను ముందే తీసేశాం
తన సినిమా స్క్రిప్ట్ లను తమను కూడా వినమని అర్జున్ చెబుతారన్నారు. సినిమా షూటింగ్ లో శ్రుతి ఐదు రోజులు మాత్రమే పాల్గొన్నారన్నారు. రిసార్ట్ కు, డిన్నర్ కు రావాలని అర్జున్ ఒత్తిడి చేసినట్లు శ్రుతి చెప్పడంపై ఐశ్వర్య స్పందించారు. తన ఇన్నేళ్ల జీవితంలో తండ్రి అర్జున్ పబ్ కు వెళ్లడాన్ని తానెప్పుడూ చూడలేదని ఐశ్వర్య అన్నారు. అలాంటిది తన తండ్రి రిసార్ట్ కు, డిన్నర్ కు రావాల్సిందిగా వేధించినట్లు శ్రుతి చెప్పడం నమ్మబుద్ది కావడం లేదన్నారు. శ్రుతి హరిహరన్ కేవలం సొంత ప్రయోజనాల కోసమే ఈ ఆరోపణలు చేస్తోందని ఐశ్వర్య విమర్శించారు.