శబరిమలలో నేడు మహా ర్యాలీ... హింసకు అవకాశముందని నిఘా వర్గాల హెచ్చరిక!
- నేడు మూతబడనున్న అయ్యప్ప ఆలయం
- ర్యాలీలో హింస తలెత్తకుండా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు
- పథనంతిట్ట జిల్లాలో 144 సెక్షన్
నిఘా వర్గాల నుంచి అందిన హెచ్చరికలతో అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం శబరిమల, పంబ, నీలక్కల్ ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించింది. పథనంతిట్ట జిల్లాలో 144 సెక్షన్ విధించింది. మహార్యాలీని విజయవంతం చేస్తామని హిందూ సంఘాలు స్పష్టం చేస్తుండగా, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు.