'ఎన్టీఆర్' బయోపిక్ కోసం జయప్రదగా రంగంలోకి దిగిన తమన్నా
- అక్కినేనిగా సుమంత్
- శ్రీదేవిగా రకుల్
- తమన్నాకు ఒక పాట కూడా
'అడవిరాముడు' .. 'సూపర్ మేన్' .. 'యమగోల' తదితర చిత్రాలు ఎన్టీఆర్ - జయప్రద కాంబినేషన్లో ఘన విజయాలను సాధించాయి. ఈ సినిమాలకి సంబంధించి ఎన్టీఆర్ బయోపిక్ లో ఒకటి రెండు సన్నివేశాలకు .. ఒక సూపర్ హిట్ సాంగ్ కు చోటుదక్కినట్టు చెబుతున్నారు. జయప్రద పాత్రలో తమన్నా ఎలా ఒదిగిపోనుందో .. ఏ సూపర్ హిట్ సాంగ్ కి స్టెప్స్ వేయనుందో చూడాలి. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకులముందుకు రానుంది.