'వడ చెన్నై'కి అనూహ్యమైన రెస్పాన్స్
- ఈ రోజే విడుదలైన 'వడ చెన్నై'
- ధనుశ్ నటనకు మంచి మార్కులు
- హైలైట్ గా నిలిచిన సంగీతం
ధనుశ్ ఇప్పటివరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒక ఎత్తు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి క్రిటిక్స్ ఈ సినిమాకి 4.5/5 రేటింగ్ ఇవ్వడం విశేషం. ధనుశ్ .. ఐశ్వర్య రాజేశ్ నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచిందని చెబుతున్నారు. ఇది తమిళవాసులకు సంబంధించిన కథ కావడం వలన, ఈ సినిమాను తెలుగులోకి అనువదించకపోవచ్చని చెప్పుకుంటున్నారు.