'సైరా' క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో చిరూ
- జార్జియాలో 'సైరా' షూటింగ్
- భారీ పోరాట సన్నివేశాల చిత్రీకరణ
- నరసింహా రెడ్డి గురువు పాత్రలో అమితాబ్
ప్రస్తుతం అక్కడ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరిగుతోంది. హాలీవుడ్ స్థాయిలో ఈ సన్నివేశాలను చిత్రీకరించడం కోసం భారీస్థాయిలో ఖర్చు చేస్తున్నారు. ఆంగ్లేయ సైన్యంపై నరసింహా రెడ్డి .. ఆయన అనుచర గణం విరుచుకుపడటం చిత్రీకరిస్తున్నారు. ఈ పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తాయనీ, సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గురువు గోసాయి వెంకన్నగా అమితాబ్ నటిస్తుండగా, ఇతర ముఖ్య పాత్రల్లో జగపతిబాబు .. విజయ్ సేతుపతి .. సుదీప్ కనిపించనున్నారు.