అమలాపాల్ కు సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించాం: విశాల్
- మహిళల భద్రత కోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నాం
- ఎవరికి ఏ సమస్య వచ్చినా... వెంటనే మా దృష్టికి తీసుకురావాలి
- 'సండకోళి-2' సినిమాలో వరలక్ష్మి అద్భుతంగా నటించింది
హీరోయిన్ అమలాపాల్ కు గతంలో ఓ సమస్య తలెత్తినప్పుడు ఆమె వెంటనే దాన్ని తమ దృష్టికి తీసుకొచ్చిందని... సంబంధిత వ్యక్తిని తాము వెంటనే అరెస్ట్ చేయించి, సమస్యను పరిష్కరించామని తెలిపాడు. 'సండకోళి-2' సినిమా ప్రమోషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, విశాల్ పైవ్యాఖ్యలు చేశాడు.
'సండకోళి-2' సినిమాలో వరలక్ష్మి అద్భుతంగా నటించిందని... సినిమా చూశాక అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటారని విశాల్ తెలిపాడు. క్లైమాక్స్ లో వరూ నటన అందరినీ మెప్పిస్తుందని చెప్పాడు. ఈ చిత్రంలో విశాల్, కీర్తి సురేష్, వరలక్ష్మి, రాజ్ కిరణ్ తదితరులు నటించారు.