నాకు టికెట్ ఇచ్చే ముందు.. ఆ బ్రోకర్‌కే ఇవ్వొచ్చు కదా?: బాబూ మోహన్
- తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమా?
- కేసీఆర్ పాలన ఆహా.. ఓహో అనుకున్నా
- నీళ్లు ఇవ్వకుండానే ఓట్లు అడుగుతున్నారు
తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల కోట్లు అప్పులయ్యాయని బాబూ మోహన్ ఆరోపించారు. తెలంగాణ వచ్చిందని చాలా ఆనందపడ్డానని.. తెలంగాణ ప్రజలకు విలువ, గౌరవం వచ్చాయనుకున్నానని.. కేసీఆర్ పాలన ఆహో.. ఓహో అనుకున్నానన్నారు. కానీ నీళ్లు ఇవ్వకుండానే ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. ప్రస్తుత సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పొద్దున లేస్తే మంత్రి హరీశ్ ఇంటి గేట్ దగ్గరే ఉంటారని, ఇటువంటి వ్యక్తిని గెలిపించ వద్దని ప్రజలను బాబూమోహన్ కోరారు.