స్నేహితుల వద్ద పడుకోమన్నాడు... నా బిడ్డ తట్టుకోలేకపోయింది: ఆత్మహత్య చేసుకున్న మాధురి తల్లి ఆరోపణ
- బిడ్డ సుఖపడుతుందని అనుకుంటే నరకం చూపించాడు
- ఫ్రెండ్సే తనకు ముఖ్యమని నాతోనే అన్నాడు
- బోరున విలపించిన మాధురి తల్లి
"నీ కూతురు నాకు వద్దు... నా ఫ్రెండ్స్ కాడికి రానంటోంది. నా ఫ్రెండ్సే నాకు ముఖ్యం. నీ కూతురు నాకు వద్దు. మందు తాగేదానికి ఒప్పుకుంటేనే నీ కూతురు నాకాడ ఉంటది అన్నాడు. ఇద్దరూ కలసి రమ్మని చెప్పాను. వాడు రానన్నాడు. కనీసం అమ్మాయిని పంపించమని అడిగితే, టికెట్ కు డబ్బులెవడిస్తాడని అడిగాడు. నా బిడ్డకు టికెట్ బుక్ చేసుకోవడం చేతకాదని చెప్పింది. దణ్ణం పెట్టి అడిగాను. డబ్బులు నేను మీ అమ్మానాన్నలకు ఇస్తానని చెప్పాను" అని బోరున విలపిస్తూ చెప్పింది. కాగా, అమెరికాలో ఉన్న కోటేశ్వరరావును ఎలాగైనా ఇండియాకు రప్పించి అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.