పొట్టి బట్టలు కట్టుకో, నాతో తాగు... అమెరికాలో భర్త వేధింపులు తాళలేక, ఇండియాకు వచ్చి యువతి ఆత్మహత్య!
- భర్త పైశాచిక ఆనందాన్ని తాళలేకపోయిన మాధురి
- 2016లో వివాహం, అప్పటి నుంచి చెడు కోరికలు
- కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
అక్కడికి వెళ్లిన తరువాత మాధురికి, కోటేశ్వరరావు అసలు స్వరూపం తెలిసింది. పొట్టి దుస్తులు ధరించి బయటకు రావాలని, లో దుస్తులు ధరించి పేకాట ఆడుతూ మందు కొట్టాలని హింసించడం ప్రారంభించాడు. ఇది సరికాదంటే చిత్ర హింసలు పెట్టాడు. దీంతో విసిగిన మాధురి గతంలో ఇండియాకు రాగా, రెండు కుటుంబాలూ నచ్చజెప్పి తిరిగి అమెరికాకు పంపించాయి.
అయినా కోటేశ్వరరావు బుద్ధి మారలేదు. ఇక అతని వేధింపులు తాళలేని మాధురి, 11వ తేదీన ఇండియాకు తిరిగి వచ్చింది. అక్కడ జరుగుతున్న ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు ఓదార్చే క్రమంలో ఉండగానే, నిన్న ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. మాధురి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.