'టైమ్ మిషన్' నేపథ్యంలో రవితేజ మూవీ
- వీఐ ఆనంద్ తో రవితేజ
- కథానాయికగా నభా నటేశ్
- డిసెంబర్లో సెట్స్ పైకి
విభిన్నమైన కథా వస్తువులను ఎంచుకుని, ఆ కథలను ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరించడం వి.ఐ. ఆనంద్ ప్రత్యేకత. అలాంటి ఆయన ఈ సారి 'టైమ్ మిషన్' నేపథ్యంలోని కథను సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం. గతంలో టైమ్ మిషన్ నేపథ్యంలో 'ఆదిత్య 369' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కథ మరో కోణంలో కొనసాగుతుందని చెబుతున్నారు. నభా నటేశ్ కథానాయికగా నటించనున్న ఈ సినిమాను, డిసెంబర్లో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. మొత్తానికి వి.ఐ.ఆనంద్ మరో కొత్త ప్రయోగం చేస్తున్నాడన్న మాట.