సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'మీటూ' విషయంలో పూజా హెగ్డే అభిప్రాయం
- నాని సరసన కన్నడ హీరోయిన్
- వచ్చే నెలలో సుమంత్ 'ఇదం జగత్'
- మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో పరశురాం!
* నాని సరసన కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించనుంది. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న 'జెర్సీ' చిత్రంలో నాయికగా శ్రద్ధాను తీసుకున్నారు.
* సుమంత్ హీరోగా అనిల్ శ్రీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇదం జగత్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మలయాళ నటి అంజూ కురియన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని వచ్చే నెలలో రిలీజ్ చేస్తారు.
* ఇటీవల 'గీత గోవిందం' చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు పరశురాం త్వరలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఓ చిత్రం చేయడానికి అంగీకరించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పని జరుగుతోంది.