‘అరవింద సమేత’ఫై రాజమౌళి స్పందన
- అది సాహసమైన నిర్ణయమేనని చెప్పాలి
- చాలా బాగా వర్కవుట్ అయింది
- తారక్ నటన చాలాకాలం గుర్తుండిపోతుంది
ఈ సినిమాను చూసిన దర్శకధీరుడు రాజమౌళి తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘ఒక యుద్ధం ముగిసిన తరువాత ఒక ప్లాట్ పాయింట్‌తో సినిమాను నడిపించడమనేది త్రివిక్రమ్ తీసుకున్న సాహసమైన నిర్ణయమనే చెప్పాలి. అది చాలా బాగా వర్కవుట్ అయింది. ఆ సీన్‌లో తారక్ నటన చాలా కాలం గుర్తుండిపోతుంది. జగపతి బాబు గారి నటన అద్భుతం. అరవింద సమేత టీం మొత్తానికి శుభాకాంక్షలు’’ అని జక్కన్న ట్వీట్ చేశారు.