చంద్రబాబు పాత్ర పోషణపై రానా ఆసక్తికర సమాధానం
- ‘నంబర్ వన్ యారీ’ సీజన్ 2 ప్రమోషన్స్‌లో రానా
- స్నేహితుల వల్లే రాణించగలుగుతున్నా
- చంద్రబాబు గారి పాత్ర చేయడం చాలా కష్టం
ప్రస్తుతం ‘నంబర్ వన్ యారీ’ సీజన్ 2 ప్రమోషన్స్‌లో ఉన్న రానా తన పాత్ర ఎంపికపై ఓ ఛానల్‌తో మాట్లాడుతూ ఆసక్తికర సమాధానమిచ్చాడు. ‘‘చంద్రబాబు గారి పాత్ర చేయడం చాలా కష్టం. అది ఛాలెంజింగ్ పాత్ర. అయితే క్రిష్ లాంటి స్నేహితుడి అండతో.. ఆ కష్టాన్ని అధిగమిస్తున్నాను’’ అని తెలిపారు. స్నేహితుల వల్లే నటన, నిర్మాణ రంగాల్లో రాణించగలుగుతున్నానని ఈ సందర్భంగా రానా వెల్లడించారు.