త్రివిక్రమ్ మళ్లీ నాలో ధైర్యం నింపాడు: సునీల్
- నాకు అన్నీ ఆయనే
- అందుకే ధైర్యం చేస్తాను
- ఆయన పట్ల నాకు నమ్మకం వుంది
"చిన్నప్పుడు తల్లిదండ్రులు .. ఆ తరువాత గురువులు .. తరువాత తోబుట్టువులు మంచి - చెడు చెబుతూ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంటారు. నా విషయంలో ఆ పాత్రలన్నింటినీ త్రివిక్రమ్ పోషించాడు. సినిమాల్లో నేను ధైర్యంగా ఏ వేషమైనా వేయడానికి .. ఏ ప్రయోగమైనా చేయడానికి వెనుకాడకపోవడానికి కారణం త్రివిక్రమ్. ఫైనల్ గా ఆయన నా కోసం ఒక మంచి పాత్రను క్రియేట్ చేయగలడనే నమ్మకం నాకు వుంటుంది. అలాగే అయన 'అరవింద'లో ఒక మంచి పాత్రను నా కోసం క్రియేట్ చేసి .. నాలో మళ్లీ ధైర్యాన్ని నింపాడు" అని చెప్పుకొచ్చాడు.