లైంగికంగా వేధిస్తున్నాడు: ముంబై బీజేపీ నేతపై మహిళా నేత ఫిర్యాదు
- ముంబై ధారవి అసెంబ్లీ సెగ్మెంట్ బీజేపీ అధ్యక్షుడిపై కేసు నమోదు
- లైంగికంగా వేధిస్తున్నాడంటూ పార్టీ కార్యదర్శి దివ్య ఫిర్యాదు
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ధారవి అసెంబ్లీ సెగ్మెంట్ బీజేపీ అధ్యక్షుడు మణిబాలన్ పై ఆ పార్టీ కార్యదర్శి దివ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేట్ సామాజిక సేవల్లో భాగంగా నిధులను తీసుకొచ్చి మురికివాడను అభివృద్ధి చేస్తుంటే... మణిబాలన్ తనను దూషించడమే కాకుండా, లైంగికంగా కూడా వేధించాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.